సంగారెడ్డి: విద్యార్థులకు అపార్ట్ కార్డు: డీఈఓ
ఆధార్ కార్డు తరహా లోనే విద్యార్థులకు అపార్ కార్డును అందజేస్తామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. విద్యార్థి ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లిన, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు కావాలన్నా అపార్ట్ కార్డు ముఖ్యమని పేర్కొన్నారు. కార్డు కోసం విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. కార్డు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.