ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మెదక్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం జాయింట్ కలెక్టర్ రమేష్‌కి వివిధ విద్యారంగ సమస్యలకు సంబంధించిన వినతి పత్రం శనివారం అందించారు. కార్పొరేట్, ప్రైవేటు, విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడికి గురి చేస్తున్నారని తక్షణమే ఇలాంటి చర్యలు చేపడుతున్న కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి దినకర్ డిమాండ్ చేశారు.