ఒక్క రంగు పోయి మూడు రంగులు వచ్చాయి తప్పా ఏం మారలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. హైదరాబాదులోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మెదక్ ఎంపీ మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. కొందరు అమాత్యులు భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై కన్నేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని శంకర్ పల్లి, రామచంద్రాపురం మండలాల మధ్యలో ఒక భూ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోందన్నారు.