శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , కమిషన్ సభ్యులు ఏడుపాయల దుర్గాభవాని మాత దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. అంతకుముందు ఆలయ పూజారులు పూర్ణకుంభం తో, పూలమాలవేసి , శాలువాతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తోపాటు సభ్యులు రాంబాబు నాయక్ , లక్ష్మీనారాయణ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.