శంకర్ పల్లి మండలం వెల్మతండాలో అక్రమ పట్టాలు పొంది భూ కబ్జాకు పాల్పడిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం డిమాండ్ చేశారు. వెలుమల తండా వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని 24 గంటల్లో తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చేవరకు రైతులతో కలిసి దీక్ష చేపడతామన్నారు. ప్రభుత్వం గిరిజనులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు.