పని నిమిత్తం బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగల్గిద్ద ఎస్సై బి. సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ఘమాతాండ గ్రామానికి చెందిన పవర్ ప్రకాష్ (35) ఉపాధి పని నిమిత్తం రెండు ఏళ్ల క్రితం మండల పరిధిలోని ఇరక్ పల్లి తాండ సమీపంలో హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 10న చక్కెర కొనుగోలు చేసుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదన్నారు. బంధువులు ఫిర్యాదుతో ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.