మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతన్ శెట్టిపల్లిలోని గెస్ట్ హౌస్లో అర్ధరాత్రి దాడి చేసి 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రూ. 49 వేల నగదు, 12 లక్షల విలువగల కాయిన్స్, 10 సెల్ ఫోన్ లు, 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు. సంతోష్ సింగ్, వెంకట్ రెడ్డి, సాయ గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.