దత్తాత్రేయుని జయంతి సందర్భంగా అంతారం గ్రామంలో గల సాయిబాబా దేవాలయంలో దత్త జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయునికి పంచామృతము సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, షోడోషోపచార పూజ మరియు గణపతి హోమం శివ పూజారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.