భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో గురువారం వారి చిత్రపటానికి పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.