మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.