నర్సాపూర్ నియోజకవర్గ చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శనివారం జాతీయ జెండాను ఎగరవేసి దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలపిట్ట దర్శనం చేసుకుని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదానంతరం 6 గంటలకు గ్రామ ప్రవేశం చేసి హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకున్నారు. కులమత తేడాలు లేకుండా అందరూ కలసి జరుపుకుంటారు.