మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏసు మని ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు సేకరించడం ద్వారా కలిగే లాభాలను గర్భిణీ స్త్రీలకు వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.