హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన జక్క మల్లేశం తన కుమారుడైన జక్కా నందీశ్వర్ భూమి రాదన్న మనస్థాపనతో సోమవారం ఉరివేసుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ బిజెపి సిపిఎం నాయకులు బాధిత కుటుంబానికి పరమర్శించి అండగా మేమున్నాము అని మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మహిపాల్ కు బోర్పట్ల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపడుతున్న పనులను ఆపాలని మరియు మృతి చెందిన జక్క నందీశ్వర్ (26) కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, తన ఎకరం భూమిని సర్వే చేసి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు వినతిపత్రం ద్వారా డిమాండ్ చేశారు.