రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేద్దామని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్లోని సాయి నగర్ లో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో భారతీయ డివిజన్ అధ్యక్షుడు నంగారెడ్డి పాల్గొన్నారు.