మత విభేదాలు రాకుండా వినాయక చవితి జరుపుకోవాలి: సీఐ

70చూసినవారు
మత విభేదాలు రాకుండా వినాయక చవితి జరుపుకోవాలి: సీఐ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్లో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అందరు కలిసి ఎలాంటి మత విబేధాలు రాకుండా వినాయక చవితి జరుపుకోవాలని అన్నారు. అలాగే డీజే, సౌండ్ బాక్స్ ల అనుమతి లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్