కారును వెనుక నుంచి బెక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన రామాయంపేట-హైదరాబాద్ 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం నిజామాబాద్ వైపునకు వెళ్తున్న కారు వెనక నుంచి బైక్‌పై వస్తున్న బైక్ ను ఢీకొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు కిందికి పడిపోయాయి. ఘటనలో పున్నాళ్ల ప్రకాశ్ అనే ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలుకావడంతో పోలీసులు అంబులెన్సులో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.