నెయ్యిలో కొవ్వును కరిగించే అత్యంత శక్తివంతమైన కాంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) పుష్కలంగా ఉంటుందని ముంబైకి చెందిన కన్సల్టెంట్ క్లినికల్ డైటీషియన్ పూజా షా భవే చెప్పుకొచ్చారు. పాలు, వెన్న, నెయ్యి, నూనె గింజలు, మాంసంలో సహజంగా లభించే సీఎల్ఏ ఉంటుందని అన్నారు. ఆవు నెయ్యిలో సీఎల్ఏ మరింత అధికంగా ఉంటుందని చెప్పారు. అయితే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే నెయ్యిని మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.