ప్రశాంతంగా తాడిపత్రి ప‌ట్ట‌ణం

80చూసినవారు
ప్రశాంతంగా తాడిపత్రి ప‌ట్ట‌ణం
ప్రస్తుతం తాడిపత్రి పట్టణం ప్ర‌శాంతంగా ఉంది. పోలింగ్ రోజు, పోలింగ్ మరుసటి రోజు భారీగా అల్లర్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. గొడవలు జరిగిన తర్వాత కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. హైదరాబాదులో ఉండి జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. కీలక నేతల ఇంటిదగ్గర పోలీస్ బందోబస్తు కొన‌సాగుతోంది.

సంబంధిత పోస్ట్