తెలంగాణలో రేషన్ కార్డుదారులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేశామని అన్నారు. చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం, మహిళలకు ఏడాదిగా ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నాం, గత అప్పులకు 10 నెలల్లో రూ.50 వేల కోట్ల వడ్డీ కట్టామని చెప్పారు.