తెలంగాణలోని వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. అయిదారు సార్లు నిబంధనలను అతిక్రమించే డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని పొన్నం తెలిపారు. అలాంటి వారి లైసెన్స్‌లను మళ్లీ పునరుద్ధరించరని అన్నారు. అలాగే వాహనాలు రిజిస్ట్రేషన్ కూడా కావని మంత్రి హెచ్చరించారు.