తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో కౌన్సిల్ నుంచి అవకాశం ఇస్తారా లేదో చూడాలన్నారు. అయితే కొత్తగా ఎన్నికైన MLC విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని గత కొంత కాలంగా జరుగుతున్న చర్చకు సురేఖ మాటలు అయోమయాన్ని కలిగిస్తున్నాయి. ఇక విజయశాంతికి మంత్రి పదవి లేనట్లేనా అని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.