13 జిల్లాల్లో పంట నష్టం.. పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

61చూసినవారు
13 జిల్లాల్లో పంట నష్టం.. పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
TG: అకాల వర్షాలకు 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాలలో పంట నష్టం జరిగింది. పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కీలక ప్రకటన చేశారు. పంట నష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు వారీగా సర్వే చేసి తుది నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వానల ప్రభావంతో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో జొన్న, 309 ఎకరాలలో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్