నాగ్‌పూర్‌లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీమ్‌ఖాన్‌కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఉదయం అతడి నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్‌పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల వీటిని కూల్చివేశామన్నారు.