కుక్క కంటిని పొడిచేసిన దుండుగుడు

74చూసినవారు
కుక్క కంటిని పొడిచేసిన దుండుగుడు
యూపీలోని ఘజియాబాద్‌లో తాజాగా దారుణం జరిగింది. వీధికుక్క పట్ల రూప్ చంద్ అనే వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. వేడిగా ఉన్న ఇనుప రాడ్‌తో కుక్క కంట్లో పొడిచాడు. దీంతో ఆ వీధికుక్క బాధతో విలవిల్లాడింది. పాత బస్టాండ్‌లోని దినగర్హి వీధి నంబర్ 3 సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బాధిత కుక్క పరిస్థితి విషమంగా ఉందని జంతు సంరక్షణ కార్యకర్తలు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్