ఏయూకు షాకిచ్చిన జేసీ

80చూసినవారు
ఏయూకు షాకిచ్చిన జేసీ
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు వైసీపీ పార్టీకి మేలు చేసేందుకు ఎన్నికల సమయంలో తలపెట్టిన ‘అచీవర్స్ డే’కు జాయింట్ కలెక్టర్ (జేసీ) అశోక్ అడ్డుకట్ట వేశారు. ఏయూలో పలువురు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాగా.. వారితో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 1400 మందితో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘అచీవర్స్ డే’ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో జేసీ కార్యక్రమాన్ని రద్దు చేయించారు.

సంబంధిత పోస్ట్