రాజస్థాన్‌లోని ఢోల్‌పుర్ కలెక్టర్ శ్రీనిధి బీటీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ బొహ్రా అనుచరులు దాడి చేశారు. కలెక్టర్ శ్రీనిధి బీటీ స్థానికంగా ఆక్రమణకు గురైన భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భూ ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా కలెక్టర్ పైనే దాడికి దిగారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేశారు.