MLAసంజయ్‌పై అనర్హత వేటు వేయాలని BRS నేత ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనది కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ అధికారిక సమావేశంలో చెప్పాడని.. ఆయన వ్యాఖ్యలను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలన్నారు. 'పార్టీ ఫిరాయింపు MLAలపై సుప్రీంకోర్టులో పోరాడుతాం. పార్టీ మారిన MLAల గల్లాలు పట్టి, కుక్కలను కొట్టినట్లు కొట్టాలని పీసీసీ హోదాలో రేవంత్ అన్నాడు. ఆయన చెప్పినట్లు కౌశిక్ రెడ్డి కొట్టలేదు. ఏ పార్టీ అని మాత్రమే అడిగాడు' అని చెప్పారు.