బీఆర్ఎస్‌కు అధికారం పోయింది. ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఈ సమయంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా? అనే సందిగ్దదంలో ఆ పార్టీ ఉంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బరిలో దిగేందకు సిద్దమవుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం మౌన ముద్రలోనే ఉంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగుదామా.. వద్దా? అన్న డైలమాలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.