సెంట్రల్ విస్టా రీ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మించారు. రూ. 862 కోట్లు ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది మే 23వ తేదీన ప్రధాని మోదీ ఈ సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రారంభించిన విషయం విధితమే. కొత్త భవనం నిర్మించిన ఏడాదికే వర్షపునీరు లీకవ్వడంతో విపక్షాలు మండిపడుతున్నాయి.