ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

83చూసినవారు
ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌
ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న మహమ్మద్‌ మొఖ్బర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్