పెంపుడు జంతువులకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం మన చూసుంటాం. ఇప్పుడు అలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఓ కోతిని చేరదీశాడు. దానికి రాణి అని పేరు పెట్టి ఇంటి పనులు చేయడం అలవాటు చేశాడు. చివరికి ఆ కోతి ఇంట్లో ఓ సభ్యురాలిగా మారిపోయి వంట చేయడంతో పాటు అంట్లు తోమి పెడుతుంది. ఈ వీడియో చూసిన కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.