ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

64చూసినవారు
ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. పార్లమెంట్‌ సమావేశాలు గత నెల 22 నుంచి ప్రారంభం కాగా తొలి రోజు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. 23న (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్