అస్సాంలో బాలికలకు నెలవారీ స్టైఫండ్‌

77చూసినవారు
అస్సాంలో బాలికలకు నెలవారీ స్టైఫండ్‌
బాల్య వివాహాలను నిరోధించేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 11వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు బాలికలందరికీ తమ ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్‌లను అందజేస్తుందని సీఎం హిమంత బిస్వా శర్మ బుధవారం ప్రకటించారు. దీనికి సంబంధించి ‘నిజుత్ మొయినా’ అనే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 10 లక్షల మంది బాలికలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా.

సంబంధిత పోస్ట్