ఖేలో ఇండియాకు అత్యధిక నిధులు

84చూసినవారు
ఖేలో ఇండియాకు అత్యధిక నిధులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ బడ్జెట్‌లో క్రీడలకు 45.36 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు. గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లకు రూ.340 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్