భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్ తుశిల్’

81చూసినవారు
భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్ తుశిల్’
అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ తుశిల్’ను ఇటీవల భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. రష్యాలోని కలినిన్‌గ్రాడ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి హాజరై దీనిని నౌకదళానికి అప్పగించారు. ఈ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో తన విధులు నిర్వర్తించనుంది. కాగా ఐఎన్‌ఎస్ తుశిల్‌ను రష్యాలో నిర్మించారు.

సంబంధిత పోస్ట్