అమెరికాలోని ఉటాకు చెందిన మైకేల్ ముర్రే అనే వ్యక్తి సుబారూ ఔట్‌బ్యాక్ కారును కొనుగోలు చేశారు. అయితే కొన్నాక దానిలో లోపాలున్నట్లు గుర్తించి వెనక్కి తీసుకొచ్చారు. ఫుల్ రీఫండ్ కావాలని డిమాండ్ చేయగా అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆయన కారుతో షోరూమ్ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.