చీర, కేబులు వైర్‌తో కట్టేసి కొడుకును చంపిన తల్లి

53చూసినవారు
చీర, కేబులు వైర్‌తో కట్టేసి కొడుకును చంపిన తల్లి
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్‌కుమార్‌(40)ను తల్లి దూడమ్మ(60) దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ భార్య, తల్లిని వేధించడం మొదలుపెట్టాడని.. ప్రవర్తన మార్చుకోకపోవడంతో చంపేశానని దూడమ్మ పోలీసులకు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్