8 నెలల చిన్నారిని వదిలేసి వెళ్లిపోయిన తల్లి

74చూసినవారు
8 నెలల చిన్నారిని వదిలేసి వెళ్లిపోయిన తల్లి
AP: ఓ తల్లి నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని నెలలు బిడ్డను సాకి అమ్మగా ఆప్యాయతను పంచింది. ఇంతలో ఏమైందో ఏమో బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. పెదకాకాని స్వస్థిశాలకు ఓ మహిళ ముఖానికి మాస్క్ ధరించి పాప (8 నెలలు) తీసుకుని ప్రార్థన చేసేందుకు వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని చెప్పి పక్కనున్న మహిళకు పాపను ఇచ్చి సాయంత్రమైనా రాలేదు. దాంతో పాపను పీఎస్‌లో అప్పగించారు.

సంబంధిత పోస్ట్