మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లు

52చూసినవారు
మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లు
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో మువ్వ‌న్నెల జెండాను ఎగురవేసేట‌ప్పుడు పాటించ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం. ప్ర‌తి పౌరుడు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని మార్గదర్శకాల ప్రకారమే త్రివర్ణ పతాకాన్ని ఎగుర‌వేయాలి. ఈ కోడ్ ప్ర‌కారం జాతీయ జెండా పొడవు, ఎత్తు నిష్పత్తి 3:2 గా ఉండాలి. చినిగిన లేదా పాడైపోయిన జెండాను ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. త్రివర్ణ పతాకం కంటే ఎత్తుగా, త్రివ‌ర్ణ ప‌తాకం ప‌క్క‌న ఏ ఇత‌ర జెండాను ఎగుర‌వేయ‌కూడ‌దు.

సంబంధిత పోస్ట్