అమెరికా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పీట్ హెగ్సేత్‌పై అతని తల్లి పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేసింది. పీట్ కు మహిళలపై చాలా చులకన భావం ఉంటుందని, తన కుమారుడి ప్రవర్తన తనకే నచ్చదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు ఇటీవలే పీట్ హెగ్సేత్ ను రక్షణశాఖ మంత్రిగా ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అతను ఈ పదవికి అనర్హుడంటూ పరోక్షంగా విమర్శలు చేసింది.