కల్వకుర్తి పట్టణంలో మైనర్ పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహిందర్ రావు అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో ఇద్దరు పిల్లలకు విముక్తి కల్పించి యజమానులకు ఫైన్ విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ స్మైల్ టీమ్ ఎస్ ఐ కృష్ణయ్య, ఏ ఎస్ ఐ వెంకటయ్య, మహిళ హెడ్ కానిస్టేబుల్ పద్మావతీ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.