మర్చాల గ్రామంలో కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కడారి వెంకటయ్య మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మార్చాల గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వెంకటయ్య తల్లి అయిన బాలమ్మకి రూ. 5,500 ఆర్థిక సహాయం శనివారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వట్టేపు బాలయ్య, మాజీ సర్పంచ్ సునీత వెంకటరెడ్డి, వట్టేపు కృష్ణయ్య, మాజీ ఎంపిటిసి కడల సంతోష మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.