వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లెలో సోలార్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని, గృహ వాణిజ్య విద్యుత్ అవసరాలతో పాటు రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కోసం జిల్లా కలెక్టర్ బి. సంతోష్ తో ప్రాజెక్టుకు అవసరమైన కార్యచరణ ప్రణాళికను గ్రామ ప్రజలతో మంగళవారం చర్చించారు.