అచ్చంపేట నియోజకవర్గంలోని టిఎస్ ఆర్టిసి ప్రయాణికులను పరోక్షంగా, ప్రత్యక్షంగా దోచుకుంటుందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేదా, మధ్యతరగతి వారు ఎక్కడికన్నా ప్రయాణించాలంటే టిఎస్ఆర్టిసి బస్సు మార్గమే చౌక అని ప్రయాణానికి వీలు ఉంటుందని సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవచ్చనే సదుద్దేశంతో ప్రయాణానికి టిఎస్ ఆర్టిసి బస్సును ఎంచుకుంటారు.
అటువంటిది చిల్లర కోసమని కొంత, డీజిల్ రేట్లు పెరిగానీ కొంత పరోక్షంగా పెంచుకుంటూ పోవడం కాక స్టాపులు లేని చోట బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని వారి గమ్యస్థానాలకుచేర్చే ప్రక్రియలో కండక్టర్లు, డిపో మేనేజర్లు గోల్మాల్ చేస్తున్నారని, బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈ స్టేజి దగ్గర స్టాప్ లేదని టికెట్ కొట్టే సమయంలో బస్సు మొదలైన స్టాపు నుండి టికెట్ కొట్టి అప్పుడు చెల్లించాల్సిన టికెట్ రుసుము గురించి చెప్తున్నారని, జేబులో డబ్బులు లేక కొందరు ఇబ్బందులు పడుతుంటే మరికొందరు30 శాతం పైగా అధిక మొత్తంలో కుచ్చుటోపి పడుతుందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.