పారదర్శకంగా కుల గణన సర్వేను నిర్వహించాలి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో కుల గణన చేపట్టేందుకు ముందస్తుగా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుల గణన ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్యుమరేటర్ లను నియమించాలని ఒక్కరికి 150 ఇల్లు కేటాయించాలన్నారు