కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమం
చిట్యాలలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లే వారికి ఆయన జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు.