
చిట్యాల: గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
చిట్యాల శివారులో ఐస్ క్రీమ్ ముసుగులో గంజాయి దందా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను చిట్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చిట్యాల - రామన్నపేట వెళ్లే రహదారిలో ఐస్ క్రీముల ముసుగులో విద్యార్థులకు, లారీ డ్రైవర్లకు, అవసరం ఉన్న వ్యక్తులకు గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారని, విశ్వసనీయమైన సమాచారం మేరకు వారిని విచారించగా వారి వద్ద నుండి ఒకటిన్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.