నాగర్జున సాగర్: తెలంగాణ ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అక్రమంగా డీసీఎం వాహనంలో తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. తిరుమలగిరి సాగర్ మండలంలో రేషన్ డీలర్ల వద్ద ఓ వ్యాపారి బియ్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో సాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.