ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చే వరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో మూడో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తో కలిసి పరిశీలించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి.