అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఎస్టి బాలుల వసతి గృహంలో మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకొని వారితో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి లింగాల రాకేష్, యలమల గోపీచంద్, నగర వైస్ ప్రెసిడెంట్ అంకురి శ్రీకాంత్, తులసి రామ్, భరత్, సునీల్, చందు, అఖిల్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.